ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టిటిడిపై భూమన కరుణాకరరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆదివారం విజయనగరం అశోక్ బంగ్లాలో విలేకరులతో మాట్లాడుతూ గతంలోకూడా భూమన కరుణాకరరెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. వృద్ధాప్యం, వ్యాధులు తదితర కారణాలతో గోవులు మరణిస్తుంటాయన్నారు