అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని మేమున్నాం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కంది సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఆదివారం ఆ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎన్ వి ఎన్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వేసవి కాలం రక్త కొరత దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. కార్యక్రమంలో డోకి చంద్రశేఖర్, తాడేపల్లి నాగేశ్వరావు, చిన్నారి చంద్రమౌళి పాల్గొన్నారు.