విజయనగరం మేమున్నాం సంస్థ అధ్యక్షులు కంది మూర్తిని ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సత్కరించారు. జిల్లాలోని ఎన్ వి ఎన్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాతల సత్కార సభ శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లాలోని పలువురు యువకులను రక్తదాతలుగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించినందుకు "మేమున్నాం సంస్థ" అధ్యక్షులు కంది మూర్తిని పెద్దలు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీశెట్టి బాబ్జి పాల్గొన్నారు.