విజయనగరం జిల్లా ఎస్ కోట ఆర్టీసీ డిపోలో జూన్ 14 నుంచి విద్యార్థులకు బస్సు పాసులు జారీ చేయనున్నట్లు డిపో మేనేజర్ కె. రమేష్ బుధవారం తెలిపారు. అర్హులకు ఉచిత పాసులు, మిగతా విద్యార్థులకు రాయితీ పాసులు అందజేస్తామని చెప్పారు. బస్సు పాసులు కావాల్సిన వారు 14లోపు ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.