వ్యవసాయం, ఉద్యాన వనాల అభివృద్ధిలో డ్రోన్ల వినియోగానికి సహకరించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోరారు. శుక్రవారం సెంచూరియన్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు కలెక్టర్ తో భేటి అయ్యారు. సెంచురియన్ యూనివర్సిటీ లో చేపడుతున్న కోర్సుల వివరాలను, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలను గురించి ఛాన్సలర్ కలెక్టర్ కు వివరించారు.