ఆసుపత్రులలో పెండింగ్ ఉన్న సివిల్ పనులు, ఎలక్ట్రికల్ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ డా. బి. ఆర్. అంబేద్కర్ తెలిపారు. ఎస్. కోట, గజపతినగరం, రాజాం, చీపురుపల్లి ఏరియా ఆసుపత్రులలో పెండింగ్ ఉన్న పనులను పూర్తి చేసి జూలై నెలాఖరుకు అప్పగించాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో వైద్య శాఖ అధికారులతో, ఇంజనీరింగ్ అధికారులతో పనుల పై సమీక్షించారు.