సారిక, చెల్లూరు పంచాయతీలలో పల్లె పండుగ అభివృద్ధి కార్యక్రమాలను బుధవారం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం పట్ల కట్టుబాటుతో విజయవంతంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. సాగునీరు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు వెల్లడించారు.