వైసీపీ నాయకులకు పరిపాలన గురించి మాట్లాడే అర్హత లేదని జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. టీడీపీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ గత అయిదేళ్ల పాలనలో కక్ష సాధింపులు, విధ్వంసాలు చేస్తూ పరిపాలనను గాలికి వదిలేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందని అన్నారు. అర్హులైన అందరికి కొత్త రేషన్ కార్డులు అందిస్తామని అన్నారు.