తమ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన కోళ్ల ఫారంను తొలగించాలని కోరుతూ మెంటాడ మండలం బిరసాడవలస గ్రామస్తులు సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గత 5 సంవత్సరాల క్రితం తమ గ్రామ సమీపంలో ఓ వ్యక్తి కోళ్ల ఫారం ఏర్పాటు చేశారని, తద్వారా విపరీతమైన దుర్గంధం వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే కోళ్ల ఫారం తొలగించాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.