విజయనగరం: మృతి చెందిన పోలీస్ కుటుంబానికి చేయూత

4చూసినవారు
విజయనగరం: మృతి చెందిన పోలీస్ కుటుంబానికి చేయూత
జిల్లా పోలీసు శాఖలో ఆర్మడ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఎం సత్తిబాబు సతీమణి రాజేశ్వరి కి ఎస్పి వకుల్ జిందాల్ శనివారం చేయూత గా రూ. 1, 47, 300 చెక్కు అందజేశారు. పోలీసు శాఖలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మృతి చెందిన పోలీస్ కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకునేందుకు తోటి ఉద్యోగులు చేయూత అందించడం అభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు పోలీసుల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్