జిల్లాలో కోవిడ్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ డా. బి. ఆర్. అంబేద్కర్ ఆదేశించారు. ప్రస్తుతమ కోవిడ్ పరీక్షల కోసం శాంపిల్స్ ను విశాఖపట్నం పంపడం జరుగుతోందని, దీనివలన ఆలస్యం అవుతోందని, జిల్లాలోనే రాపిడ్ టెస్ట్ లు చేయడానికి రెండు రోజుల్లో కోవిడ్ పరీక్షలకు అవసరమగు ఎక్విప్మెంట్ ను ఏర్పాటు చేయాలనీ మంగళవారం తెలిపారు.