రామభద్రపురం మండలం భూసాయ వలస గ్రామంలోని భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏడు ద్వారాలు ఏర్పాటు చేసి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా, చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయం చుట్టూ భక్తి స్వరూపమైన వాతావరణం కనిపించింది.