విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేని భవన నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ సిబ్బంది శుక్రవారం కూల్చి వేసే ప్రక్రియ ప్రారంభించారు. కాగా అనుమతులు లేని భవన నిర్మాణాలను ఉపేక్షించబోమని నగర పాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని తోట పాలెంలో ప్లాన్ అప్రూవల్ లేకుండా భవనంపై అంతస్తులో చేపట్టిన నిర్మాణాన్ని కూల్చివేశారు. భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి అని తెలిపారు.