విజయనగరం: సీఎస్ఆర్ నిధులతో 40 చెరువుల అభివృద్ది
By BHAVANI THADI 65చూసినవారుచంపావతి నదీపరీవాహక ప్రాంతంలో సీఎస్ఆర్ నిధులతో 40 చెరువుల పునరుద్దరణకు ప్రణాళికను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. యాక్సిస్ బ్యాంకు సీఎస్ఆర్ నిధులతో ధాన్ ఫౌండేషన్ ద్వారా ఈ పనులు జరుగుతాయని, ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదన వచ్చిందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ధాన్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలెక్టర్ తమ ఛాంబర్‌లో గురువారం సమావేశమయ్యారు.