విజయనగరం: సబ్ జైలును తనిఖీ చేసిన జిల్లా జడ్జీ

59చూసినవారు
విజయనగరం: సబ్ జైలును తనిఖీ చేసిన జిల్లా జడ్జీ
విజయనగరం సబ్‌జైల్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు న్యాయ అవగాహన కల్పించేందుకు నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. జైల్‌ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ కార్యకలాపాలను, పారా లీగల్‌ వాలంటీర్ల పనితీరును సమీక్షించారు. ఖైదీలతో మాట్లాడుతూ వారికి అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంటగది, భోజనశాల, స్టోర్‌ రూమ్‌ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్