11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21న ప్రధాని మోదీ విశాఖలో పాల్గొంటున్న యోగా కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా శనివారం యోగా మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. జిల్లా నోడల్ అధికారి, జేసీ సేతు మాధవన్ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా వ్యాప్తంగా సచివాలయాల పరిధిలో సన్నాహక యోగా అభ్యాసాలు నిర్వహించారు.