విజయనగరం: ఇంటర్మీడియట్ విద్యార్థుల చదువు మెరుగుపడాలి

75చూసినవారు
విజయనగరం: ఇంటర్మీడియట్ విద్యార్థుల చదువు మెరుగుపడాలి
ఇంటర్మీడియట్ విద్యార్థుల చదువు డిసెంబర్ నెలలో జరిగే అర్థ వార్షిక పరీక్షలలో మెరుగుపడాలని విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రిన్సిపాళ్ళను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్లో కళాశాల ప్రిన్సిపాళ్లతో సమీక్షించారు. క్వార్టర్లీ పరీక్షలలో జిల్లాలో 18 కళాశాలల్లో పాసైన విద్యార్థుల సంఖ్య 41% మాత్రమేనని, అంత ఎక్కువ మంది ఫెయిల్ కావడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఇదే కొనసాగితే సహించేది లేదన్నారు.

సంబంధిత పోస్ట్