రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తును క్షున్నంగా పరిశీలించి ఆడిట్ చేసి సానుకూలంగా పరిష్కరించాలనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన్ ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తాసీల్దార్లు పరిష్కరించిన ప్రతి దరఖాస్తును ఆడిట్ చేయాలనీ చెప్పారు. సదస్సుల్లో మొత్తం 6846 దరఖాస్తులు రాగా ఇప్పటికే 2776 దరఖాస్తులను తహసిల్దార్లు పరిష్కరించారని వాటిని కూడా ఆడిట్ చేయాలనీ తెలిపారు.