విజయనగరం: మహిళల ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలి

80చూసినవారు
విజయనగరం: మహిళల ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలి
విజయనగరం మహిళా పోలీసు స్టేషను డిఎస్పీగా ఆర్. గోవిందరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ను జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ డిఎస్పీ గోవిందరావును అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఫిర్యాదుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని, ఫిర్యాదులు అందిన వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్