శాంతిభద్రతల పరిరక్షణలో స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పనితీరు చాలా క్రియాశీలకమని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో క్షేత్ర స్ధాయిలో నిర్వహించాల్సిన విధులపై దిశా నిర్ధేశం చేసారు. ఎస్బి సిబ్బంది క్షేత్ర స్థాయిలో ముందస్తు సమాచారంను సేకరించేందుకు సమాచార వ్యవస్థను మెరుగుపర్చుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.