జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో సమాచార ఏర్పాటు చేసుకోవాలని ఎస్పి వకుల్ జిందాల్ కోరారు. శనివారం ఆయన కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పనితీరు క్రియాశీలకమైనదని అన్నారు. ముందస్తు సమాచారం సేకరించేందుకు సమాచార వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని దిశా నిర్దేశం చేశారు.