టిడిపి కూటమి ఏడాది పాలనలో జిల్లాకు ఇచ్చిన హామీల అమలుపై చొరవ చూపలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ విమర్శించారు. వ్యవసాయ రంగానికి తగిన సాయం అందించలేదని, అభివృద్ధి కేవలం మాటలకే పరిమితమైందని ఆరోపించారు. బుధవారం ఎల్‌బిజి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సూపర్ సిక్స్ వంటి హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.