విజయనగరం: అంబేద్కర్ స్ఫూర్తితో అత్యున్నత స్థాయికి ఎదగాలి

61చూసినవారు
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని దేశం గర్వించే స్థాయికి ఎదగాలని కోరారు. సోమవారం కలెక్టరేట్లో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్