జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం బాలాజీ మార్కెట్ లో గురువారం సమావేశం జరిగింది. జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరమ్ రూపొందించిన గోడ పత్రికను జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఏ.కృష్ణ ప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం బాలల చేత పని చేయడం చట్టరీత్యా నేరమని, బాలలను కార్మికులుగా పనిలో చేర్చుకోవద్దని యాజమాన్యాలకు అవగాహన కలిగించారు.