విజయనగరం: గంజాయి కలిగి ఉన్న వ్యక్తి అరెస్టు

41చూసినవారు
విజయనగరం: గంజాయి కలిగి ఉన్న వ్యక్తి అరెస్టు
గంజాయి కలిగివున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన విజయనగరంలో శనివారం చోటు చేసుకుంది. పట్టణంలోని అయ్యప్ప నగర్ వాకింగ్ ట్రాక్ వద్ద అయ్యన్నపేట కు చెందిన మజ్జి కృష్ణ వర్ధన్ అనే వ్యక్తి గంజాయితో ఉన్నాడనే సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు కృష్ణవర్ధన్ నుండి 3 కేజీల గంజాయితో పాటు కత్తిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్