విజయనగరంలోని మహిళా పార్కులో పాముల నియంత్రణకు ముందస్తు చర్యలలో భాగంగా గుళికలు వేయడం జరుగుతుందని, కావున రెండు రోజుల పాటు మహిళా పార్కు మూసివేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత కొన్నాళ్లుగా మహిళా పార్కులో పాములు సంచరిస్తున్నట్లు తమ సిబ్బంది గమనించారని, పాముల వల్ల ప్రమాదం జరగకుండా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పాముల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు.