విజయనగరం ఫూల్ బాగ్ కాలని దగ్గర గల మూగ, చెవిటి మరియు బ్లైండ్ పాఠశాలలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం సందర్శించారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా మూగ, చెవిటి మరియు బ్లైండ్ విద్యార్థుల మధ్యలో సతీసమేతంగా పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు. విద్యార్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో తన పుట్టినరోజు జ్ఞాపకంగా మొక్కను నాటారు.