విజయనగరం: ప్రజా దర్బార్‌ నిర్వహించిన ఎమ్మెల్యే అదితి

59చూసినవారు
విజయనగరం: ప్రజా దర్బార్‌ నిర్వహించిన ఎమ్మెల్యే అదితి
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ప్రజల నుంచి పలు ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ముఖ్యంగా రెవెన్యూ, హౌసింగ్, పింఛన్లు, రోడ్లు, కాలువలు, విద్యుత్ వంటి అనేక అంశాలపై వినతులను స్వీకరించారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్