తెలుగులో తొలి కావ్యం రచించిన రచయత్రి మొల్లమాంబయని, ఆమె చరిత్ర భావితరాల వారికి తెలియజేయవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డా. బి. ఆర్. అంబేద్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ జ్యోతిని వెలిగించి, మొల్ల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖుల్ని స్మరించుకునేటప్పుడు వారి ఘనతను మాత్రమె మాట్లాడుకోవాలని, వారి కులాన్ని బట్టి గౌరం ఇవ్వకూడదని తెలిపారు.