శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవాన్ని మే 12న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎన్‌విడివి ప్రసాద్ మంగళవారం తెలిపారు. మే 12వ తేదీ సోమవారం సా 4 గంటలకు అమ్మవారి వనం గుడివద్ద భారీ ఊరేగింపు ప్రారంభమై హుకుంపేట చేరుకుంటుందని, తిరిగి రాత్రి 10 గంటలకు అక్కడ పూజలు అనంతరం మంగళవారం ఉదయానికి చదురు గుడి చేరుకుంటుందన్నారు భక్తులు పాల్గొవాలని కోరారు.