విజయనగరం పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తాడి గోవింద అధ్యక్షుడిగా, శ్రీనివాసరావు అసోసియేట్ ప్రెసిడెంటుగా, ఆదిలక్ష్మి, జగన్నాధరావు, కృష్ణ కుమార్, శంకర్రావు వైస్ ప్రెసిడెంట్లుగా ఎంపికయ్యారు. సూర్యనారాయణ కార్యదర్శిగా, సంజీవరావు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.