విజయనగరం: మత్తు, మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలి

311చూసినవారు
విజయనగరం: మత్తు, మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలి
మత్తు, మాదకద్రవ్యాల వినియోగానికి విద్యార్థులు దూరంగా ఉండాలని ఈగల్ టీం హెచ్ సి విజయ్ కుమార్ అన్నారు. విజయనగరం స్థానిక తోట పాలెం లో గల సాహితీ జూనియర్ కళాశాలలో శనివారం ఈగల్ విభాగం ఐ జి ఆకే రవి కృష్ణ ఆదేశాలతో మాదకద్రవ్యాల వినియోగం తద్వారా కలిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు చెడు సహవాసాలకు పాల్పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్