టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును విజయనగరంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సింహాచల దేవస్థానం పంచ గ్రామాల భూముల క్రమబద్దీకరణపై అశోక్‌తో చర్చించారు. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, పంచకర్ల రమేష్, తదితరులు అశోక్‌ను కలిసిన వారిలో ఉన్నారు.