సైబర్ నేరాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వన్ టౌన్ సిఐ ఎస్ శ్రీనివాసరావు కోరారు. ఆదివారం సాయంత్రం విజయనగరం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని వసంత విహార్ రెసిడెన్స్ లో నివాసముంటున్న ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న నేరాలు, దొంగతనాలు జరుగుతున్న తీరుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సైలు అప్పారావు, రామ గణేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.