విజయనగరం: "ఈ-బీట్స్" విధానం అమలుతో పోలీసు గస్తీ పటిష్టం

77చూసినవారు
విజయనగరం: "ఈ-బీట్స్" విధానం అమలుతో పోలీసు గస్తీ పటిష్టం
జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు "ఈ-బీట్స్" విధానంను అమలు చేసి, పోలీసు గస్తీని మరింత పటిష్టం చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. ఈ-బీట్స్ విధానంపై పోలీసు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించి, అమలు చేయడంలో వారి సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా ఎస్పీ జూమ్ మీటింగ్ నిర్వహించారు. రాత్రి/పగటి పహారాను లైవ్ లో పర్యవేక్షించి, సమయానుకూలంగా సిబ్బందిని అవసరమైన ప్రాంతానికి పంపవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్