విజయనగరం: నేడు కరెంటు సరఫరాకు అంతరాయం

70చూసినవారు
విజయనగరం: నేడు కరెంటు సరఫరాకు అంతరాయం
విజయనగరంలోని వీటి అగ్రహారం 11 కెవి ఫీడర్ పరిధిలో మరమ్మత్తులు చేపడుతున్న నేపథ్యంలో శుక్రవారం కరెంటు సరఫరా కు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఈ ఈ త్రినాధరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కుసుమ గణపతి నగర్, ఆర్ అండ్ బి, అలకనంద కాలనీ, సి బి కాలనీ ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్