మాదక ద్రవ్యాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు చేపట్టిన“సంకల్పం” కార్యక్రమానికి స్కాచ్ అవార్డు లభించిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసుశాఖ చేపట్టిన చర్యలను 'సంకల్పం' కార్యక్రమం ఇస్తున్న ఫలితాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి 'స్కాచ్' అవార్డుకు ఎంపిక చేసిందన్నారు.