గిరిజన ప్రాంతాలలో రేషన్ సరఫరాను పాత ఎండియు విధానంలోగానీ, ప్రత్యేక రేషన్ డిపోలను ఏర్పాటు చేయడం ద్వారాగానీ రేషన్ పంపిణీ చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రస్తుతం రేషన్ తీసుకోవడంలో గిరిజనులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ సివిల్ సప్లై కమిషనర్ కు, ఎస్టి కమిషన్ లేఖ రాయడం జరిగిందని తెలిపారు.