విజయనగరం జిల్లాలో 23 సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు రూ.4.67 కోట్లతో మరమ్మతులు చేస్తున్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో సాంఘిక సంక్షేమ, ఆర్అండ్బీ, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ పనుల ప్రగతి, విద్యార్థుల హాజరు శాతంపై సమీక్ష చేశారు. హాస్టళ్లలో మరమ్మతులు నెలాఖరులోగా పూర్తి చేయాలని వారానికి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.