మృతి చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ. కోటి పరిహారం తక్షణం ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు డిమాండ్ చేశారు. గురువారం ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయనగరం విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మానసికంగా ఆందోళనకు గురి చేస్తున్న ఇటువంటి శిక్షణలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఉద్యోగులు పట్ల అధికారులు అవలంబిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు.