విజయనగరం జోన్ స్థానిక అరుకులో శనివారం జోనల్ చైర్మన్ దొన్ను దొరను ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి. భానుమూర్తి కలిశారు. అనంతరం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 8న జరిగే ఆర్టీసీ బోర్డు సమావేశంలో సమస్యల పరిష్కారం కోసం చర్చిస్తానని హామీ ఇచ్చారు.