ఈ నెలాఖరుకు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. మండల అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు, క్లోరినేషన్, ఇంటింటి ఆరోగ్య సర్వే పై ఆరా తీశారు. బహిరంగ మల విసర్జన పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. త్రాగునీటి ట్యాంకులు శుభ్రం చేసి నీటిని నింపేటప్పుడు తప్పనిసరిగా క్లోరినేషన్ చేయాలని చెప్పారు.