విజయనగరం: స్థానిక గూడ్స్ షెడ్ వద్ద గల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంలో శనివారం ముందస్తు సంక్రాతి సంబరాలు ఘనంగా జరిపారు. రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాలలో రంగవల్లులు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్య క్రమంలో రోటరీ గవర్నర్ వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, సెక్రటరీ శంకర్ రెడ్డి, రామారావు, శివ, పాల్గొన్నారు.