విజయనగరం: 30 మందితో శక్తి టీమ్స్: ఎస్పీ

62చూసినవారు
విజయనగరం: 30 మందితో శక్తి టీమ్స్: ఎస్పీ
జిల్లాలో మహిళలపై దాడులు, వేధింపులను నియంత్రించేందుకు శక్తి టీమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శక్తి టీమ్స్ తో గురువారం ప్రత్యేకంగా సమావేశమై సూచనలు ఇచ్చారు. విజయనగరం, బొబ్బిలి, రాజాం పట్టణాల్లో 30 మందితో అయిదు బృందాలతో టీం ఏర్పాటు చేశామన్నారు. ఒకొక్క బృందానికి ఎస్ఐ నాయకత్వం వహిస్తారని చెప్పారు. ఈ టీమ్స్ జిల్లాలోని కళాశాలలు, ముఖ్య కూడళ్లను మఫ్టీలో సందర్శిస్తారని చెప్పారు.

సంబంధిత పోస్ట్