విజయనగరంలోని గూడ్స్ షెడ్ వద్ద కొందరు గంజాయి సేవిస్తున్నారన్న పక్కా సమాచారంతో శుక్రవారం పోలీసులు రైడ్ చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. పట్టుబడిన వారంతా కె ఎల్ పురం, బాబామెట్ట, దాసన్నపేటకు, వుడా కాలనీకి, చెందినవారు. వీరిలో కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారు. వారి వద్ద నుంచి గంజాయి సేవిస్తున్న పరికరాలు, గంజాయి, స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.