విజయనగరం జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న అధికారులతో ఎస్‌పి వకుల్ జిందాల్ బుధవారం మాసాంతర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ, పట్టణ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.అవసరమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 112/శక్తి యాప్ కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు.