విజయనగరం: పోలీసు వెల్ఫేర్ డే నిర్వహించిన ఎస్పీ

56చూసినవారు
విజయనగరం: పోలీసు వెల్ఫేర్ డే నిర్వహించిన ఎస్పీ
విజయనగరం జిల్లా పోలీసు శాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం 'పోలీసు వెల్ఫేర్ డే' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందిని తన ఛాంబర్‌లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.

సంబంధిత పోస్ట్