మున్సిపల్ ప్రాంతాల్లో పందుల సమస్యను నివారించే చర్యల్లో భాగంగా, వాటి కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించాలని జేసీ ఎస్. సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో పందుల సమస్య పరిష్కారంలో భాగంగా గౌరవ హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత అధికారులతో, పందుల పెంపకం దారులతో కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.