దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలను తల్లితో కలిసి దర్శించుకుంటూ సుమారు 92వేల 5వందల కిలోమీటర్లు యాత్రను కర్ణాటక రాష్ట్రం మైసూర్ కు చెందిన కృష్ణకుమార్ విజయవంతంగా పూర్తిచేశారు. ఈసందర్బంగా బుధవారం విజయనగరం విచ్చేసిన వారిని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో రాత్రి బస, భోజనం ఏర్పాటు చేసినట్టు పెంటపాటీ కామరాజు తెలిపారు. కార్యక్రమంలో మూర్తి, రెయ్యి శంకర్ రెడ్డి, దుస్సాలువతో సత్కారం చేశారు.