సంక్రాంతి పండగ సందర్భంగా శుక్రవారం విజయనగరం జిల్లాలోని ప్రైవేటు బస్సులను తనిఖీలు చేశామని రవాణాశాఖ ఉప కమిషనర్ మణి కుమార్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన 10 బస్సులపై కేసులు నమోదు చేసి రూ. 45 వేల జరిమానా విధించామన్నారు. ఈనెల 20వ తేదీ వరకు తనిఖీలు జరుగుతాయని చెప్పారు. ప్రవేటు ఆపరేటర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.